తెలంగాణలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ మంత్రులు సమర్థవంతంగా పని చేయడం లేదు. చాలా మంది మంత్రులు అసలు సచివాలయం వద్దకు కూడా వెళ్లే ప్రయత్నం చేయక పోవడంతో సీఎం కేసీఆర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పరిపాలన విషయంలో కూడా కొంత మంది మంత్రుల నుంచి సీఎం కేసీఆర్ కు సహకారం రావడం లేదు.
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే మరో మంత్రి కేటీఆర్ మాత్రమే సీఎం కేసీఆర్ కు సహకారం అందిస్తున్నారు. ఈటెల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్ కు కాస్తో కూస్తో సహకారం అందిస్తున్నారు. మిగిలిన మంత్రులు ఎవరూ కూడా పెద్దగా టిఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా కనపడటం లేదు. కొంత మంది మంత్రులను జిల్లాలో పర్యటించాలని చెప్పినా సరే హైదరాబాదులో లేకపోతే బెంగళూరులోని ఎక్కువగా ఉంటున్నారు.
దీని వలన సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీని కారణంగా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఆక్టివ్ గా కనపడటం లేదు. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ కొంతమంది మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కొంత మంది మంత్రులను ఆయా శాఖల నుంచి పక్కకు తప్పించే ఆలోచనలో ఆయన ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దాదాపుగా ఎనిమిది మంది మంత్రుల శాఖలను సీఎం కేసీఆర్ మారుస్తారట.