తెలంగాణ ఎంసెట్ తుది విడత షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ తుది విడత షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 25 వ తేదీ నుండి తుది విడత అడ్మిషన్స్ కౌన్సెలింగ్ జరుగనుందని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. అలాగే నవంబర్ మాసం రెండు న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్న తెలంగాణ విద్యాశాఖ… సీట్ల రద్దు కు నవంబర్ 7 వరకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

నవంబర్ 6 వరకు ఆన్లైన్ లో రిపోర్టింగ్ కి అవకాశం ఉంటుందని…నవంబర్ 9 నుండి స్పెషల్ రౌండ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటన చేసింది. అలాగే నవంబర్ 12 న సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 15 లోపు సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజి లో ఆన్లైన్ రిపోర్ట్ చేయాలని వెల్లడించింది తెలంగాణ విద్యాశాఖ. అలాగే స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ నవంబర్ 14 న విడుదల అవుతాయని తెలిపింది. ఇంకా తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు http.//tsecet.nic.in/ వెబ్ సైట్ లో విద్యార్థులు చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news