హైదరాబాద్ బి ఆర్ కే ఆర్ భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కార్యదర్శి రిజ్వితో వైద్యులు, వైద్య సిబ్బంది చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసిన వైద్య సంఘాలు అతి త్వరలో సమస్యలని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. హుజురాబాద్ లో వైద్యుల పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మంత్రికి వైద్య సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
ఈ సంధర్భంగా డాక్టర్స్, పారామెడికల్ సంఘాల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించారు మంత్రి ఈటల. ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సంఘాలు ప్రకటించాయి. ఇక కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషయా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా ల్లో విధానాలను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అలానే డాక్టర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ప్రభుత్వం జీవో ఇవ్వనుoదని ఈటల తెలిపారు. ఇక కరోనా వచ్చి లీవ్ లో ఉన్న వాళ్లకు ఆన్ డ్యూటీ కింద పరిగణనలోకి తీసుకుంటూ జీవో ఇస్తామని ఈటల పేర్కొన్నారు.