ఎంపీ రఘురామ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఎంతపెద్ద దుమారం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆయన అరెస్టుకు ముందు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. దీనిపై ముందు నుంచి వైసీపీ నేతలు టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇక దీనిపై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్‌ను దాఖలు చేశారు. ఇందులో జగన్ కీలక వాదన వినిపించారు. బెయిల్ షరతులను జగన్ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక రఘురామది స్వార్థ ప్రయోజనాల కోసమే కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని పిటిషన్లో తెలిపారు. సీబీఐ పరిధిలోని కేసు కేంద్రహోం శాఖ పరిధిలోకి వస్తుందని, దీనిపై మధ్యవర్తి ప్రమేయం ఉండదని లాయర్లు కోర్టుకు స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు రూ.900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్నారని, ఆయనపై సీబీఐ కేసులు ఉన్నట్టు గుర్తు చేశారు.