టార్గెట్-600: రేవంతుడి కష్టాలు…!

-

తెలంగాణ రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య ఆసక్తికరమైన ఫైట్ నడుస్తోంది. ఎన్నికలు ఇప్పుడే లేకపోయినా…పార్టీలు మాత్రమే ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే రాజకీయం చేస్తున్నాయి. మళ్ళీ మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ చూస్తుంటే…తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ చూస్తుంది. ఇక వరుసగా రెండు సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్…మూడోసారైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఈ మూడు పార్టీలు సమయానికి తగ్గట్టు వ్యూహాలు వేసుకుంటూ ముందుకెళుతున్నాయి. ఒక పార్టీపై ఒక పార్టీ పైచేయి సాధించేలా పనిచేస్తున్నాయి. అధికారంలోకి రావడానికి ఎవరు వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ సరికొత్త ఎత్తులతో ముందుకెళుతుంది. ఇటు బీజేపీ సైతం క్షేత్ర స్థాయిలో బలపడితేనే అధికారం దక్కించుకుంటామని భావించి..ఆ దిశగా పనిచేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్‌కు ఎలాగో క్షేత్ర స్థాయిలో బలం ఉంది..కాకపోతే కింది స్థాయి నేతలని యాక్టివ్ చేస్తే కాంగ్రెస్ బలపడుతుందనే పరిస్తితి.

అయితే ఈ విషయంలో కొద్దో గొప్పో టీఆర్ఎస్, బీజేపీలు ముందున్నాయి. కానీ కాంగ్రెస్ వెనుకబడింది…అందుకే కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయన టార్గెట్ ఒక్కటే..మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని… రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాల్లో బలపడితే అధికారంలోకి వస్తామని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.

పార్టీని బలోపేతం చేసేందుకు మండలాలను ప్రాతిపదికగా తీసుకుని సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయ కర్తలకు గైడెన్స్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో మండలానికి కనీసం 10 వేల మందికి కాంగ్రెస్ సభ్యత్వం ఇస్తే…ప్లస్ అవుతుందని రేవంత్ భావిస్తున్నారు. ఆ పని చేయించేందుకు నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆఫర్లు ఇస్తున్నారు. ఎవరైతే సభ్యత్వం ఎక్కువ చేయిస్తారో వారిని..రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లి సన్మానం చేయిస్తానని అంటున్నారు. అంటే ఇలాంటి ఆఫర్లు ఇవ్వనిదే కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లెలా లేవు. మొత్తానికి కాంగ్రెస్‌ని లేపడానికి రేవంతుడు బాగానే కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news