తెలంగాణ పీఆర్సి రిపోర్ట్ విడుదల.. కీలక ప్రతిపాదనలు !

-

తెలంగాణ పి ఆర్ సి రిపోర్ట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి పి ఆర్ సి కమిషన్ ఏవయితే ప్రతిపాదనలు పంపినదో దానికి సంబంధించి రిపోర్ట్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కీలక ప్రతిపాదనలు ఈ మేరకు ఉన్నాయి. 7.5 శాతం ఫిట్మెంట్, బేస్ శాలరీ 19000, అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలి, అంతేగాక హేచ్చార్సీ తగ్గిస్తూ పిఆర్ ఈ కమిషన్ సిఫార్సు చేసింది. 30 శాతం హేచ్చార్సీఉన్నచోట 24 శాతం 20 శాతం హేచ్చార్సీ ఉన్నచోట 17 శాతం, 14.5% ఉన్నచోట 13 శాతం, 12 శాతం ఉన్న చోట 11 శాతం హేచ్చార్సీ తగ్గించాలని ప్రతిపాదించింది. అలాగే గ్రాట్యుటీ పరిమితి 16 లక్షలకు పెంచాలని కూడా సిఫార్సు చేసింది.

ఇక ఎన్జీవోల పిల్లలకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ తొలగిస్తూ సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిస్తే ఒక్కో విద్యార్థికి రెండు వేల ఇన్సెంటివ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి గత నెల 31న ప్రభుత్వానికి పిఆర్సి కమిషన్ రిపోర్టు ఇచ్చింది. ఇక మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు ఈ వివరాలు ప్రభుత్వం అందజేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news