నేటి నుండి తెలంగాణా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ లు 

-

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. అయితే రిజిస్ట్రేషన్  వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నాన్‌-అగ్రికల్చర్‌ ఆప్షన్‌ ఓపెన్‌ కావడం లేదు. చాలా కాలం తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందు బాటులోకి రావడంతో స్లాట్ల బుకింగ్‌ పెరిగింది. ఆస్తుల క్రయ విక్రయదారులు స్లాట్ల కోసం పోటీ పడుతుండటంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.

మరోపక్క ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయబోమని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల్లోనే ఎక్కువ దరఖాస్తులున్నాయి. ఈ స్కీమ్‌ ఇప్పటికీ ముందుకు సాగడం లేదు. కోర్టులో కేసు ఉండడంతో రెగ్యులరైజేషన్‌ ఇప్పట్లో సాధ్యం కాదని పలువురు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై అందుబాటులో పెట్టిన కాల్‌సెంటర్‌ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

Read more RELATED
Recommended to you

Latest news