మల్లన్న భక్తులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ వినిపించింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది. శ్రీశైలానికి రాత్రిపూట కూడా ప్రత్యేక బస్సులు నడుపుతామని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
ఈ ప్రత్యేక సేవలతో, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆలయానికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగానే, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ డోబ్రియాల్ భక్తుల ప్రయోజనం కోసం నవంబర్ 20 వరకు టీఎస్ఆర్టిసి బస్సులను రిజర్వు ఫారెస్ట్ ఏరియా గుండా వెళ్లడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో, హైదరాబాద్ నుండి శ్రీశైలం ఆలయానికి ఉదయం 3:45 నుండి 11:45 గంటల మధ్య టిఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులను నడపనుంది.