కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. ఫెస్ బుక్ ప్రేమ కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, ఉస్మా బేగం అనే యువతి కామారెడ్డి జిల్లాకు చెందినది. అయితే.. ఉస్మా బేగంకు యూపీకి చెందిన షెహజాద్ అనే వ్యక్తితో…ఫెస్ బుక్ ద్వారా పరిచయమైంది.
ఆ పరిచయం కాస్తే.. ప్రేమకు దారి తీసింది. అయితే… ఈ నేపథ్యంలోనే… బాన్స్ వాడలో అదృశ్యమైన ఉస్మా బేగం యూపీ లో దారుణ హత్యకు గురైంది. ఫెస్ బుక్ లవర్ చేతిలో ఉస్మా బేగం హత్యకు గురైంది.
ఈ నెల 6న బాన్స్ వాడ లో అదృశ్యమై.. ఇవాళ శవమై తేలింది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రేహ జిల్లాకు చెందిన షెహజాద్ ను నిందితునిగా పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమని కోరితే ఇటుక తో కొట్టి చంపాడు షెహ జాద్. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.