Breaking : ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతం

-

రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 554 పోస్టులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించింది. పరీక్షకు పోలీస్‌శాఖ పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి 9 గంటల నుంచి హాల్‌టికెట్లు, ఐడీ కార్డుల పరిశీలించి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా 538 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగ్గా.. 91.32శాతం అభ్యర్థులు హాజరయ్యారు. 2,25,759 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. మొత్తం 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సై ప్రాథమిక పరీక్షకు హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రిలిమినరీ పరీక్ష కీ ని త్వరలో www.tslprb.in వెబ్ సైట్ లో ఉంచుతామని రిక్రూట్ మెంట్ బోర్డ్ వెల్లడించింది. ప్రాథమిక రాత పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించే మార్కులను తొలిసారిగా కుదించారు.

Telangana Police Recruitment 2022: Registration Begins For 16,614 Posts  From May 2, Check Notification on tslprb.in

గత పరీక్షల్లో సామాజిక వర్గాలవారీగా మార్కులుండేవి. ఈసారి సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో అబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలున్నాయి. వీటిలో 30 శాతం మార్కులు సాధిస్తే పరీక్ష గట్టెక్కినట్లే… అంటే 60 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించగలిగితే చాలు అర్హత సాధించినట్లే. మరోవైపు ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులుండటం కీలకంగా మారింది. ఐదు తప్పుడు సమాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించనున్నారు. అందుకే సరైన సమాధానాలు తెలిసిన ప్రశ్నలపైనే దృష్టి పెట్టాలి. పరీక్షలో 60 సరైన జవాబులను పక్కాగా గర్తించగలికే చాలు. తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాస్తే నెగెటివ్ మార్కులతో మొదటికే మోసం రావచ్చు. తుది రాత పరీక్షలో మాత్రం నెగటివ్ మార్కులుండవు.

 

Read more RELATED
Recommended to you

Latest news