తిరుమలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ నుంచి తిరుమలకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
తర్వాత అదే రోజున అదే రాత్రి తిరుమల వకుళామాత గెస్ట్ హౌస్‌లో ఆయన బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 8.30 నిమిషాలకు తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం అమిత్ షా తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కోట్ బయల్దేరి వెళ్లనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ సమయంలో అమిత్ షా రాష్ట్రానికి వస్తుండటంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూటమిగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు ఇటీవల అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.