తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… రాష్ట్రంలోని విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, ఐడి కార్డు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఉన్నత అధికారుల నుంచి సమాచారం అందుతుంది.
- వీటికోసం ఏ విధంగా 300 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం.. ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అన్నీ ఓకే అయితే వచ్చే సంవత్సరం నుంచి, ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ పథకం అమలు అవుతే ఏకంగా 25 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కానుంది.