తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత.. రేపటి నుంచి థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు ఓపెన్ !

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ అయింది. ఈ సందర్భంగా లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అన్ని రకాల నిబంధనలను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో ఇక తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు. రేపటి నుంచి సాధారణంగా పరిస్థితులు ఉండనున్నాయి. రాష్ట్రంలో పాజిటివిటి రేటు తగ్గడంతో వైద్యశాఖ నివేదిక ఇచ్చింది. వైద్యశాఖ నివేదికతో రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆన్ లైన్ కాకుండా నేరుగా పాఠశాలలు,కళాశాలల్లో తరగతలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి సినిమా థియేటర్లు, పబ్బులు ఓపెన్ కానున్నాయి. బార్లు, రెస్టారెంట్లు, పార్కులు కూడా ఓపెన్ కానున్నాయి. అలాగే బస్సులు, మెట్రో రైళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఆటోలు, క్యాబ్ లు, ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వస్తాయి. రవాణా రంగం పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇక పెళ్లిలు, అంత్యక్రియలకు ఎంత మందైనా హాజరవ్వవచ్చు. కానీ బహిరంగ ప్రదేశాలలో మాస్కులు, భౌతిక దూరం పాటించాలని తెలంగాణ కేబినెట్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news