Telangana : రాష్ట్రంలో 50 వేల మంది టీచర్ల బదిలీ

-

తెలంగాణలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో దాదాపు సగం మంది బదిలీ కానున్నారు. మొత్తం 26 వేల పాఠశాలల్లో సుమారు 1.04 లక్షల మంది పనిచేస్తుండగా.. వారిలో 50 వేల మందికి బదిలీ అవుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధ్యాయుల్లో తప్పనిసరి బదిలీ కిందే 25 వేల మంది ఉన్నారు.

ఒక పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు, అయిదేళ్ల సర్వీసు పూర్తయిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మిగిలిన వారు ఒకేచోట రెండేళ్లు పనిచేస్తే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో మరో 25 వేల మంది వరకు ముందుకొస్తారని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బదిలీ అయ్యే ఉపాధ్యాయుల సంఖ్య 30 వేలు ఉండొచ్చని ఇంతకుముందు అంచనా వేయగా.. ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా పదోన్నతులు దక్కనున్న మరో 9,700 మందికి కూడా బదిలీ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news