తెలంగాణ నేడు కొత్తగా 733 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రం క‌రోనా వైర‌స్ రోజు రోజుకు త‌గ్గుముఖం ప‌డుతుంది. నేటి కరోనా బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో 56,487 క‌రోనా నిర్దార‌ణ పరీక్షలు చేయ‌గా.. కేవ‌లం 733 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 7,81,569 కి చేరింది. అలాగే ఈ రోజు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక‌రు మృతి చెందారు.

corona
corona

దీంతో క‌రోనా మ‌ర‌ణాలు 4,104 కు చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2,850 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ రాష్ట్రంలో గ‌త మూడు రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 లోపే న‌మోదు అవుతున్నాయి. అలాగే రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గింద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌క‌టించింది. థ‌ర్డ్ వేవ్ లో ప్ర‌తి రోజు 7 నుంచి 8 వేల కు పైగా కరోనా కేసులు న‌మోదు అయ్యాయి. కానీ ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి భారీ గా త‌గ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news