ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా లో పుట్టిన ఈ ఒమిక్రాన్ వేరియంట్… ఇప్పటికే 25 దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో తెలంగాణ రాష్ట్రం అప్ర మత్తం అయింది. అంతేకాదు.. ఒమిక్రాన్ కేసుల పై తొలిసారి బులిటెన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చిన వారి లో ఇవాళ 9 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటెన్ లో స్పష్టం చేసింది.
ఇప్పటి దాకా మొత్తం 13 పా జిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది ప్రభుత్వం. అలాగే… జీనోమ్ సీక్వెన్స్ కు 13 కేసులు పంపినట్లు పేర్కొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపింది. అ లాగే.. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 198 కరోనా కేసులు నమోదయ్యాయని.. అలాగే.. ఇద్దరు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,76,574 కు చేరుకున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం.