రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి…..

-

ఈరోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు గవర్నర్ తమిళ సై ఘన స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం హైదరాబాదు వచ్చిన ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఐదు రోజులు బస చేయనున్నారు. తిరిగి ఈనెల 23వ తేదీన ఢిల్లీకి తిరిగి ప్రయాణం కానున్నది.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటి మంత్రి శ్రీధర్ బాబు ,గిరిజన శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మరియు డిజిపి రవి గుప్తాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి స్వాగతం పలికారు.

రేపు సికింద్రాబాద్లోని పబ్లిక్ స్కూల్ లోని సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటుంది. ఈ నెల 20వ తేదీన యాదాద్రి భువనగిరి లోని పోచంపల్లికి వెళ్ళును. అలాగే అదే రోజున సాయంత్రం సికింద్రాబాద్లోని రాష్ట్రపతి ఎమ్మెన్నార్ఎడ్యుకేషన్ ట్రస్ట్ సర్వోత్సవ వేడుకల్లో పాల్గొంటుంది.

డిసెంబర్ 21వ తేదీన రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తుంది. డిసెంబర్ 22వ తేదీన వివిధ ప్రముఖులకు రిసెప్షన్ను ఏర్పాటు చేయనున్నారు.తిరిగి 23న ఢిల్లీకి  వెళ్ళును.

Read more RELATED
Recommended to you

Latest news