KTR: తెలంగాణ నుంచి అమరరాజా వెళ్లి పోతానడడంపై కేటీఆర్ సంచలన పోస్ట్ చేశారు. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ నుండి వెళ్ళిపోతామని ప్రకటించారట అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ చైర్మన్ జయదేవ్ గల్లా. తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో అమర రాజా కంపెనీకి చేసిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే, మేము మా ప్లాంట్ కోసం వేరే చోట వెతకవలసి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ చైర్మన్ జయదేవ్ గల్లా.
ఇక ఇదే అంశంపై కేటీఆర్ స్పందించారు. రాజకీయ విభేదాల వల్ల బ్రాండ్ తెలంగాణ బాధపడకూడదని… తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజును ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామన్నారు. అమరరాజా ఇప్పుడు వెళ్లిపోతే తెలంగాణకు తీవ్ర నష్టం అన్నారు. తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజును ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని….అలాంటి కంపెనీకి ఇచ్చిన హామీలు అమలు చేయండి అని రేవంత్ రెడ్డిని కోరారు. కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుండి గుజరాత్‌కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి పోగొట్టుకోవడం, అమరరాజా ఇప్పుడు వెళ్లిపోతే అది విపత్తు అని హెచ్చరించారు కేటీఆర్.
https://x.com/KTRBRS/status/1822459694075592936