రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్ర రాజకీయలు వంటి ఇతరత్రా అంశాలపై కాంగ్రెస్ హై కమాండ్ తో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నాడు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రత్యేక విమానంలో రేపు ఉదయం ఢిల్లీకి బయలుదేరి మళ్లీ సాయంత్రమే హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతాడు. హై కమాండ్ తో చర్చలు ముగిసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీనీ కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రధాని యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.
కాగా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన పనులు పూర్తయినట్టు సమాచారం. రేపు ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో హోం ,విద్య, సాంఘిక సంక్షేమ ,వైద్య మున్సిపల్ శాఖ వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. వీటితోపాటు నామినేటెడ్ పదవుల గురించి కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పదవుల విస్తరణ జరుగునట్లు తెలుస్తుంది.ఈరోజు లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్చార్జి లను ప్రకటించిన విషయం తెలిసిందే.