గాలివాన బీభత్సం.. తెలంగాణలో 13 మంది మృత్యువాత

-

ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం ఆదివారం సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెమాల్‌ తుపాను ప్రభావం తెలంగాణను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ… మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. గాలి వాన బీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

షెడ్డు కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, ఓ డ్రైవరు చనిపోయారు. హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరు వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. ద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవ్వడంతో ప్రజలు వణికిపోయారు. హయత్‌నగర్‌ నుంచి వనస్థలిపురం మీదుగా ఎల్బీనగర్‌ వరకూ, మల్కాజిగిరి, మేడ్చల్‌ నుంచి శామీర్‌పేట్‌ మీదుగా కీసర, ఘట్‌కేసర్‌ వరకూ వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Read more RELATED
Recommended to you

Latest news