తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌–4లో మరో 141 పోస్టులు

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. గ్రూప్-4 కొలువులు మరిన్ని పెరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,039 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తోంది.

తాజాగా గ్రూప్-4 కేటగిరి లో మరో 141 పోస్టులను జత చేస్తూ అనుబంధ ప్రకటనను శనివారం విడుదల చేసింది. దీనితో గ్రూప్-4 కేటగిరీలో పోస్టుల సంఖ్య 8,180 కు చేరింది.

తాజాగా ప్రకటించిన 141 పోస్టులు మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి సంబంధించిన ఖాళీలు. ఇందులో బాలుర గురుకుల విద్యా సంస్థలకు సంబంధించి 86 పోస్టులు ఉండగా, బాలికల విద్యాసంస్థలకు సంబంధించి 55 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?