తెలంగాణ రాష్ట్ర మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెండు లక్షల మహిళల స్వయం సహాయ సంఘాల ఖాతాల్లోకి 217 కోట్లు బ్యాంకర్లు జమ చేసినట్లు మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు.
బ్యాంకులు గతంలో అధికంగా వసూలు చేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో వేసామని తెలిపారు. మూడు లక్షల వరకు రుణంపై గరిష్టంగా ఏడు శాతం… మూడు లక్షల నుంచి 5 లక్షల వరకు రుణంపై 10 శాతం మాత్రమే వసూలు చేశామని ఆర్బిఐ సూచించినా… కొన్ని బ్యాంకులో అధిక వడ్డీ వేసాయని తెలిపారు. దీంతో సమీక్షించి వసూలు చేసిన వడ్డీని తిరిగి జమ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మంత్రి హరీష్ రావు.