ఎడిట్ నోట్: మళ్ళీ ‘సెంటిమెంట్’..భయమేనా!

-

ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కుమార్తె ఇరుక్కోవడం..మరోవైపు టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ లీకేజ్..ఇక వరుసగా అగ్నిప్రమాద ఘటనలు..అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం..ఇక రాష్ట్రంలో ప్రజా సమస్యలు..పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు..ఇలా ఎటు చూసుకున్న ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్తితి కేసీఆర్‌ది..ఈ సమస్యులతో రాజకీయంగా చాలా ఇబ్బందులు వచ్చాయి.

ఇక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. మామూలుగా ఆయనకున్న రాజకీయ చతురతతో నెగిటివ్ ఉన్నా సరే దాన్ని పాజిటివ్ గా మార్చుకోగలరు..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కనిపించడం లేదు. ప్రతిదీ రిస్క్ పెంచుతుంది. ఇక ఎలాంటి ఇబ్బంది ఉన్న ప్రెస్ మీట్ పెట్టి..కేంద్రాన్ని టార్గెట్ చేసి సమస్యలని డైవర్ట్ చేసే కే‌సి‌ఆర్ ఎందుకో భయపడుతున్నారా? అనే పరిస్తితి..అందుకే ఇప్పుడు మీడియా ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలోనే ఆయన ఉన్న సమస్యలని తప్పించుకోవడానికి మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన బి‌ఆర్‌ఎస్ శ్రేణులకు తాజాగా లేఖ రాశారు. ఇంతకాలం పార్టీ శ్రేణుల గురించి పెద్దగా మాట్లాడని కే‌సి‌ఆర్‌కు సడన్ గా పార్టీ కార్యకర్తలు గుర్తొచ్చారు. ఒక దెబ్బకు సెంటిమెంట్ లేఖ ఒకటి ప్రయోగించారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ అధికారంలో కొనసాగుతున్న కాలం వరకు పరిస్తితులని వివరిస్తూ లేఖ రాశారు.

14 సంవత్సరాలలో పార్టీ ఎదుర్కొన్న అనేక కష్టనష్టాలను గుర్తు చేస్తూ.. మీరే నా బలం.. నా బలగం అంటూ కే‌సి‌ఆర్ గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితి పేరుతో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశవ్యాప్తం అవుతున్నామని, తాను చేసే ఈ ప్రయత్నానికి అందరూ కలిసి రావాలని కేంద్రంలో కిసాన్ సర్కార్ స్థాపించే వరకు ఎవరు మడమ తిప్పకూడదని లేఖలో పేర్కొన్నారు.

ఇలా ఉన్నపళంగా కే‌సి‌ఆర్ లేఖ రాయడానికి కారణం ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఎక్కడైనా పార్టీ శ్రేణులు నాయకుడే వెంటే ఉంటాయి. అలాంటిది తనకు మద్ధతుగా ఉండాలని బి‌ఆర్‌ఎస్ శ్రేణులని కే‌సి‌ఆర్ కోరడం కాస్త విడ్డూరంగానే ఉంది. అంటే వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యం..మరో వైపు సమస్యలు సుడిగుండంలో ఉన్న నేపథ్యంలో ఓ లేఖ రాసి..బి‌ఆర్‌ఎస్ శ్రేణుల్లో సెంటిమెంట్ లేపి..వారు పోరాటం దిశగా వెళ్ళేలా చేస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ సెంటిమెంట్ ఎంతమేర ఉపయోగపడుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news