అంగ‌న్ వాడీ టీచ‌ర్ల‌కు 2 ల‌క్ష‌లు, ఆయాల‌కు ల‌క్ష.. సీతక్క అదిరిపోయే న్యూస్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీలకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా  కేంద్ర మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ లో తెలంగాణ‌లో ప్ర‌త్యేకంగా అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు మంత్రి సీత‌క్క‌. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అవ‌స‌రాల‌ను కేంద్రం ముందుంచిన సీత‌క్క‌ ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగ‌న్ వాడి సెంట‌ర్ల‌ను మంజూరు చేయాల‌ని కేంద్రాన్ని విజ్న‌ప్తి చేసారు సీత‌క్క‌.

అంగ‌న్ వాడీ కేంద్రాల్లో టీచ‌ర్లకు కొత్త‌ ట్యాబ్ లు ఇవ్వాల‌ని కోరింది సీత‌క్క‌. అంగ‌న్ వాడీ కేంద్రాల్లో న‌ర్సీరీ క్లాస్ ల‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి మ‌రింత స‌హాకారం అవ‌స‌రం  అని పేర్కొంది. 3989 మిని అంగ‌న్ వాడీల‌ను మెయిన్ అంగ‌న్ వాడీల‌కు గా మార్చాం. అక్క‌డ టీచ‌ర్ల‌కు ట్రెయినింగ్ ఇచ్చి మెరుగైన సేవ‌లు అందిస్తున్నాం. రిటైర్ అవుతున్న అంగ‌న్ వాడీ టీచ‌ర్ల‌కు 2 ల‌క్ష‌లు, ఆయాల‌కు ల‌క్ష రూపాయ‌ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వ‌బోతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news