విద్యాశాఖలో త్వరలోనే 21 వేల పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. నిన్న ఆమె అసెంబ్లీ లో లో మాట్లాడుతూ… రాష్ట్రంలో 973 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే అడ్మిషన్లు కావాలని ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు. టీచర్లకు 14 నుంచి ఆంగ్ల భాషపై శిక్షణ ఇస్తామని ఆమె ప్రకటించారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అలాగే నాణ్యమైన విద్య అందిస్తామని ఆమె అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. మూడు దశల్లో ఆధునిక ఇస్తామని.. దీనికోసం బడ్జెట్ లో ఏడు వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని ఆమె స్పష్టం చేశారు.
ఈ నిధులతో 26 వేల పాఠశాలలను బాగు చేస్తామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలకు 25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాల కు 50 లక్షలు అలాగే ఉన్నత పాఠశాల కు కోటి రూపాయలు ఖర్చు చేస్తే… దాతల పేర్లు ఆ పాఠశాలలకు పెడతామని తెలిపారు. ఎవరైనా రెండు లక్షలు ఖర్చు చేస్తే స్కూల్ సభ్యుడిగా ఉంచుతామని… 10 లక్షలు ఖర్చు చేస్తే వారి పేరు పెడతామని వివరించారు.