తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 24 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు సంఖ్య నిల‌క‌డ‌గా వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో ప్ర‌తి రోజు 30 లోపే కేసులు న‌మోదు అవుతున్నాయి. శుక్ర‌వారం రాష్ట్రంలో 15 కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ రిపోర్ట్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ క‌రోనా రిపోర్ట్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 కరోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 222 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. కాగ ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 14,127 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. కాగ ఇంకా 336 ప‌రీక్ష ఫ‌లితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news