కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లెక్చరర్స్, టీచర్స్, డ్రగ్ ఇన్ స్పెక్టర్, మెడికల్ సిబ్బందికి ఉద్యోగ నియామక పత్రాలను ఇవాళ ఎల్బీస్టేడియంలో అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టిఎస్పిఎస్సి ని పూర్తిగా ప్రక్షాళనలు చేశాం. మూడు నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని.. గత ప్రభుత్వం ఫామ్ హౌస్ మత్తులో ఉండే నిరుద్యోగ సమస్యలను పట్టించుకోలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో భయటపడతాయో తెలియని పరిస్థితి ఉండేది. కనీసం పెంపుడు కుక్కకు ఉన్న విలువ.. పేదోడి ప్రాణానికి లేదా అని ప్రశ్నించారు. కుటుంబ ఉద్యోగుల కోసం ప్రజల ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రయత్నం చేసింది. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు.. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. గుంటూరు, గుడివాడలో చదువుకొని వచ్చిన వాళ్ళు నాకు ఇంగ్లీషు రాదని ఎగతాళి చేస్తున్నారు. విద్యార్థుల పై పెట్టే దానిని ఖర్చుగా చూడవద్దని.. పెట్టుబడిగా చూడాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 6000 ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వ మూసివేసింది. ఉద్యోగాలు రాక ఎంతో ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. మీ కళ్ళల్లో ఆనందం చూసేందుకే ఎల్బీ స్టేజియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలని.. మూడు నెలల్లో మా పనితీరు చూసి తీర్పు ఇవ్వండి అని కోరారు.