తెలంగాణలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17 కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సీఎస్ ను ఆదేశించారు.

బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించాలన్నారు.

మరో 33 బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు : 

ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news