హైదరాబాద్ మెట్రో కింద పార్కు చేసిన 50 వాహనాలు చోరీ..!

-

హైదరాబాద్ లో భారీగా ద్విచక్ర వాహనాల చోరీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని వివిధ మెట్రో స్టేషన్స్ కింద పార్కు చేసిన వాహనాలు సుమారు 50కి పైగా చోరీకి గురయ్యాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఈ వాహన దొంగలు పట్టుబడ్డారు. అయితే ఈ వాహనాలు చోరీ గురించి వరుస కేసులు నమోదు అవుతుండటంతో నిఘా పెట్టిన పోలీసులు.. పక్క సమాచారంతో అంబర్ పేట నుండి అశ్వారావుపేట కు చేరుకున్నారు ఎస్ఐ, సిబ్బంది.

తమకు అందిన సమాచారం ప్రకారం ప్లాన్ తో దొంగలను అరెస్ట్ చేసారు పోలీసులు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బండ్లలో 12 ద్విచక్ర వాహనాలు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించగా..18 ద్విచక్ర వాహనాలు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి, తొట్టి పంపు గ్రామాలకు చెందిన ఇద్దరు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version