తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని 20,555 మంది VRA ల్లో 5,950 మందిని ఇరిగేషన్ శాఖలో లష్కర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రూ. 19 వేల మూల వేతనం అందనుందని తెలుస్తోంది.
కాగా, మొత్తం VRAల్లో దాదాపు 10వేల మంది కేవలం సంతకం చేయగలిగేవారే. దీంతో వారిని ఎలా రెగ్యులరైజ్ చేయాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న వారిని అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది.