ఇటీవల కాలంలో గుండెపోటు సంఖ్య పెరిగిన విషయం అందరికి తెలిసిందే.. అతి చిన్నావయస్సులోనే గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..దీనికి కారణం ఏంటనే విషయం తెలియదు కానీ సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు వినిపిస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.
అయితే.. తాజాగా వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోటుకు మరో బాలిక బలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంకు చెందిన నిహారిక(13) గుండెపోటుతో చనిపోయింది. తనకు కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు నిహారిక చెప్పగా, మణుగూరులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా కుప్పకూలింది. వైద్యులు పరీక్షించి నిహారిక గుండెపోటుతో చనిపోయిందని నిర్ధారించారు.