మహిళలు వాళ్ల జీవితంలో ప్రతి నెల శానిటరీ ప్యాడ్‌లను వాడుతుంటారు. నిజానికి అది అవసరం కానీ.. వారి ఆరోగ్యానికి, పర్యావరణానికి ఇవి అస్సలు మంచివి కావు.. సరే పర్యావరణ సంగతి పక్కన పెడితే.. ముందు ఇవి మీ ఆరోగ్యానికే మంచివి కావు.. వీటిని సరైన విధంగా వాడకపోతే చాలా సమస్యలు వస్తాయి. కానీ ఈరోజుల చాలా మంది మహిళలు వీటిని వాడే విషయంలో తప్పులు చేస్తున్నారు. ఓ ఎన్జీవో నిర్వహించిన పరిశోధనల్లో ఈ షాకింగ్ విషయం బయటపడింది. ఆ తప్పులు ఏంటో వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటో చూద్దామా..!
శానిటరీ ప్యాడ్‌లో ఉన్న కొన్ని రసాయనాలు మహిళల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నట్టు తేలిందట. అయితే పీరియడ్స్ సమయంలో ఆడవాళ్లకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కడుపు నొప్పి, తిమ్మిరి, మూడ్ స్వింగ్స్, అలసట, బలహీనత వంటి సమస్య వస్తాయి. ఇవి సర్వసాధారణమే అయినా.. పీరియడ్స్ టైంలో పరిశుభ్రతను పాటించాలి. లేదంటే లేని పోని సమస్యలు వస్తాయి. నెలసరి సమయంలో శరీరం నుంచి బ్యాక్టీరియా విడుదలవుతుంది.
ముఖ్యంగా శానిటరీ ప్యాడ్‌ను 4 గంటలకోసారి మార్చకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి నాలుగు గంటలకు ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్‌ను మార్చాలి.
చాలా మంది ఆడవారు తమ రక్తప్రవాహాన్ని బట్టి ప్యాడ్లను మారుస్తారు. ఎక్కువగా బ్లీడింగ్ కాలేదంటే.. ప్యాడ్‌ను మార్చరు.. మళ్లీ స్నానం చేసేప్పుడే చేంజ్‌చ చేస్తారు.. ఏదేమైనా రక్తప్రవాహం ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ప్రతి 4 గంటలకు ప్యాడ్‌ను ఖచ్చితంగా మార్చాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. బ్లీడింగ్ అవ్వట్లేదని ప్యాడ్‌ను రోజంతా అలాగే ఉంచుకుంటే మీకు అంటువ్యాధులు వస్తాయి. అసలు బ్లీడింగ్ అవకుండా ప్యాడ్ వేసుకుంటే.. చాలా చిరాకుగా ఇరిటేషన్‌గా అనిపిస్తుంది.
యోనికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ల్యూకోరియా.. ల్యూకేరియా అంటే యోని నుంచి తెల్లగా లేదా పసుపు రంగులో వచ్చే స్రావం. దీనివల్ల ఆడవాళ్లు బలహీనంగా అవుతారు. బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్యాడ్‌ను సకాలంలో మార్చకపోవడం వల్లే ల్యూకేమియా వస్తుంది. యోని దురద వస్తుంది…
తడిగా ఉండే ప్యాడ్‌ను ఎక్కువ సేపు ఉంచుకోవడం వల్ల చర్మం చికాకు కలుగుతుంది. అంతేకాదు చర్మం ఊడిపోవడం ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. దుర్వాసన.. మీరు సమయానికి ప్యాడ్‌ను మార్చకపోతే ప్యాడ్ నుంచి చెడు వాసన రావడం ప్రారంభమవుతుంది. చాలా రోజుల వరకు యోని నుంచి చెడు వాసన వస్తుంది. కానీ పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే బ్యాక్టీరియా వల్ల అక్కడి నుంచి కుళ్లిన వాసన వస్తుంది. బ్లీడింగ్ అయిన అవ్వకున్నా.. ప్యాడ్‌ను కచ్చితంగా నాలుగు గంటలకు ఒకసారి కచ్చితంగా మార్చుకోవాలి.. పీరియడ్స్ సమయంలో వర్జైనా ఏరియాను గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే.. ఆ బాక్టీరియా, ఇన్‌ఫెక్షన్ అంతా తగ్గుతుంది. బాగా టైట్‌గా ఉండే దుస్తులు ఆ సమయంలో అస్సలు వేసుకోకూడదు.