నేడు దక్షిణ కొరియాకు తెలంగాణ మంత్రులు !

-

నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంత్రులు, అధికారుల బృందం పర్యటించనుంది. ఈ మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, GHMC , మూసి రివర్ ప్రంట్ అధికారులు బృందంలో ఉంటారు. సియోల్ నగరం లో మాపో లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించనున్నారు మంత్రులు, అధికారులు. రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది సియోల్ నగరపాలక సంస్థ.

ponnam

దీనికోసం WTE ( వెస్ట్ టూ ఎనర్జీ ) టెక్నాలజీని వినియోగించనుంది. పర్యావరణం పై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఉంది. మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతుంది సియోల్ నగర పాలక్ సంస్థ. ఇటువంటివి నగరం లో నాలుగు ప్లాంట్లను నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశం పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంత్రులు, అధికారుల బృందం పర్యటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news