తెలంగాణ రైతులకు అలర్ట్..రుణమాఫీ పేరుతో నయా మోసం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర పోలీసులు హెచ్చరించారు. రుణమాఫీ పేరుతో నయా మోసం జరుగుతోంది. ఫో న్ కు లింక్ పంపి రుణమాఫీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి అంటున్నారు సైబర్ నేరగాళ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారింది.
ఫోన్ కు లింక్ పంపి ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటూనే మీరు రుణమాఫీకి అర్హులవుతారు అంటూ మెసేజుల్లో, వాట్సప్ లో లింకులు పంపుతున్నారు సైబర్ ముఠా. నిన్న రెండు, మూడు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో అప్రమత్తమైన పోలీసు శాఖ..తెలంగాణ రైతులను అలర్ట్ చేసింది.
కాగా, పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా రూ.లక్షలోపు మాఫీకి తెలంగాణ ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాలకు రూ.6,098.93 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454.49 కోట్లు మాఫీ అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు రూ.లక్షలోపు రుణం మాఫీ అయినట్లు వెల్లడించారు.