ఈ ఏడాది మొత్తం 22060 కేసులు నమోదయ్యాయి – సిపి ఆనంద్

-

ఈ ఏడాది మొత్తం 22060 కేసులు నమోదయ్యాయి అని తెలిపారు సిపి సి.వి ఆనంద్. 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందన్నారు. పీస్ ఫుల్ గా ఈ ఏడాది ముగుస్తుంది అని అనుకోలేదన్నారు. కోవిడ్ మూలంగా జనాలు కూడా ఎక్కువగా బయటికి రాలేదని.. కోవిడ్ తర్వాత ప్రతి ఫంక్షన్ కి జనాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. బోనాలు, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్, మిల్ద్ ఉన్ నబి ఇలాంటి వాటికీ ఎక్కువ సంఖ్యలో జనాలు హాజరయ్యారని తెలిపారు.

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఇక్కడే జరిగిందని, వజ్రోత్సవాలు కూడా ఇక్కడే జరిగాయన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా ముగిశాయన్నారు. సైబర్ క్రైమ్ కి సంబంధించిన నేరాలు పెరిగాయన్నారు. వాహనాల దొంగతనాలు కూడా ఈ ఏడాది పెరిగాయన్నారు. అలాగే ఈ ఏడాది 273 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం 1082 నిందితులను అరెస్టు చేసామన్నారు. అందులో 13 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news