సంగారెడ్డి జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి బంధువులు కొట్టారని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డిలోని మునిపల్లి (మం) మాలపాడ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పుల్కల్ గ్రామానికి చెందిన యువతి, రంజిత్. అయితే.. నిన్న రాత్రి యువతి బర్త్ డే ఉండటంతో పుల్కల్ కు వెళ్లి ప్రియురాలిని కలిశాడు రంజిత్.
అయితే… రంజిత్ తో యువతి చనువుగా ఉండటాన్ని గమనించిన యువతి కుటుంబ సభ్యులు… ఆగ్రహంతో రంజిత్ పై దాడి చేశారు. దారుణంగా రంజిత్ ను కొట్టారట. అయితే.. ఆ అవమానం తట్టుకోలేక సింగూర్ బ్యాక్ వాటర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. దీంతో యువతి కుటుంబ సభ్యులే కొట్టి చంపేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.