పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడింది ఓ యువతి. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన ఓ యువతి. రాజేంద్రనగర్‌లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి దుండగులు చొరబడినట్లు బయటకు వచ్చింది ఓ న్యూస్. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ చేశారట.

గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసి.. దుండగులు పరారయ్యారట. కట్ చేస్తే…..యువతి స్కెచ్ బెడిసికొట్టింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి చోరీ డ్రామా చేసింది..దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బులు అపహరించారని, భీభత్సం చేశారు అని మీడియా ముందు చెప్పుకొచ్చింది. పొలీసులు విచారణ మొదలు పెట్టగానే అసలు నిజం బట్టబయలయ్యింది.