నేడు ఏసీబీ కస్టడీకి మాజీ రెరా కార్యదర్శి శివబాలకృష్ణ

-

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్‌ చేసిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు. నేటి నుంచి 8 రోజులపాటు అతణ్ని విచారించనున్నారు. చంచల్‌గూడా జైలులో ఉన్న శివబాలకృష్ణను ఈరోజు ఉదయం 9 గంటలకు ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారించనుంది. విచారణలో భాగంగా బినామీ ఆస్థులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అతను అనుమతులు జారీ చేసిన భవన నిర్మాణ గుత్తేదారులను విచారించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. న్యాయవాది సమక్షంలో శివబాలకృష్ణను విచారించాలని, థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని న్యాయస్థానం ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈనెల 24, 25వ తేదీన శివబాలకృష్ణ ఇల్లు సహా బంధువులు, సన్నిహితుల నివాసాలు కలిసి మొత్తం18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తనిఖీల్లో భారీగా ఆస్తులతోపాటు విలువైన భూములు, విల్లాలు, ప్లాట్లకి చెందిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గర్తించిన 15 బ్యాంకు ఖాతాలు లవాదేవీలపై అధికారులు అరా తీయనున్నారు. శివ బాలకృష్ణ సహా అయన భార్య, కుమార్తె, కుమారుడు అతనిసోదరుడు నవీన్‌కుమార్‌ పేర్లపై ఆబ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని ఖాతాలకు లాకర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిని వారి సమక్షంలో తెరిచేందుకు అధికారులు సిద్దమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version