భవన నిర్మాణ కార్మికులకు కేసీఆర్ తీపికబురు..త్వరలోనే వారికి మోటార్ సైకిల్స్

భవన నిర్మాణ కార్మికులకు కేసీఆర్ సర్కారు తీపికబురు అందించింది. భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు ప్రారంభంలో హరీష్ రావు పాల్గొని మీడియాతో మాట్లాడారు.

కార్మికులకు ఉచిత బీమా చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కెసిఆర్ దని గుర్తు చేశారు. Health City కి వెళ్ళాం 12 వందల కోట్లతో 24 అంతస్థుల భవనం, 2 వేల పడకలు, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందులో ఉంటాయని పేర్కొన్నారు.

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నం. ఏడాది లోగా ఆ హాస్పిటల్ ను పూర్తి చేస్తామని వెల్లడించారు. మరో ఆరు నెలల్లో అన్ని రకాల పరికరాలు అందిస్తామని.. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదని.. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా కార్మికులు లబ్ధి పొందాలని ఆకాంక్షిస్తున్నానని ప్రకటించారు.