గత ప్రభుత్వం అన్నా కాంటీన్ మూసేసింది. కానీ మేము ఇప్పటికే 175 అన్నా క్యాంటీన్ లు ప్రారంభించాం. 15 రూపాయలకే మూడు పూటలా భోజనం ఎక్కడైనా పెడతారా.. అన్నా క్యాంటీన్ లో తప్ప. అలాగే ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పా… మీకు దగ్గరగా నది, వాగు ఉంటే ఇసుక ఉచితంగా తెచ్చుకోండి. ఏ రాష్ట్రానికి వెళ్లినా పింఛన్ వెయ్యి, 2 వేలు ఇస్తున్నారు..ఇక్కడ 4 వేలు ఇస్తున్నాం. ఎన్ఠీఆర్ 30 రూపాయలు పింఛన్ మొదలు పెడితే నేను సీఎం అయ్యాక 70, ఆ తరువాత 200 చేశా.. ఆ తరువాత వెయ్యి, 2 వేలు చేశా. ఇపుడు 4 వేలు ఇస్తున్నా.
ఇక ఇప్పటి నుండి మద్యం షాపుల్లో వేలు పెడితే షాక్ కొట్టాలి. మద్యం షాపుల్లో బిసిలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. ఇక పై మద్యం కోసం కర్ణాటక, తెలంగాణ కు వెళ్లాల్సిన అవసరం లేదు. క్వార్టర్ బాటిల్ 99 కి ఇవ్వాలని ఆదేశించా. కానీ తాగకుండా చేయాల్సిన బాధ్యత ఆడబిడ్డలదే. మద్యం అలవాటు మాన్పించేందుకు 100 కోట్లు ఖర్చు చేస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు.