మీరు మారినట్టు ప్రభుత్వాలు మారవు.. విజయసాయిరెడ్డి కి అద్దంకి దయాకర్ కౌంటర్..!

-

విజయసాయిరెడ్డి పెద్ద అజ్ఞాని అని.. ప్రధానిని జోకడమే పని పెట్టుకున్నారని ఆరోపిస్తూ.. టీపీసీసీ  అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశాడు. తెలంగాణ ప్రభుత్వం పై కామెంట్స్ చేయడం పరిపాటిగా మారిందని.. మొన్న ఒక్కడు, నిన్న ఒక్కడు నేడు ఒకడు అన్నట్టు వంతులు వేసుకొని కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు చేస్తే.. ఆయన పెద్ద రాజకీయ అజ్ఞానిలా కనిపిస్తున్నారని.. అజ్ఞానంలో పెద్దల సభకు ఎలా నేతృత్వం వహిస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు అని.. మోడీ దగ్గర మార్కులు కొట్టేయాలని.. నిండు సభలో ప్రభుత్వాలని కూలగొడతామని మాట్లాడటంతో నీకు ఏ మాత్రం రాజకీయ తెలివి ఉందో అర్థం అవుతుందన్నారు. మీరు జగన్ కి సలహాదారుగా ఉండి పొలిటికల్ లీడర్ గా మారినట్టు ప్రభుత్వాలు మారవని సూచించారు. కావాలంటే మేము కూడా జగన్ ప్రభుత్వం పై కామెంట్స్ చేయగలమని గుర్తుంచుకోవాలన్నారు. బానిసత్వంతో మోడీని జోకడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ సీఎం అయ్యేవాడా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news