తెలంగాణకు కేంద్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది భారత ప్రభుత్వం. దీని వల్ల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, టన్నెల్ వంటి ప్రజా పనులు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు నిర్మించబడతాయి.
ముఖ్యంగా జాతీయ రహదారి, NH-44 నిజామాబాద్ వైపు, తెలంగాణ రాష్ట్ర రహదారి, SH-1 కరీంనగర్ వైపు ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. తెలంగాణకు కేటాయించిన 175 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ తో.. కంటోన్మెంట్ నుంచి రెండు వైపుల నిర్మాణాలకు లైన్ క్లియర్ అయిందన్న మాట. దీంతో కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో నిర్మాణాలకు లైన్ క్లియర్ అయింది. కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో రోడ్లు విశాలంగా ఉండనున్నాయి.