తెలంగాణ వచ్చిన తర్వాత యువతకు ఒరిగిందేమీ లేదు – పొంగులేటి

-

ఖమ్మం జిల్లా సత్తుపల్లి‌లో రైట్ చాయిస్ అద్వర్యంలో పోటి పరీక్షల ఉచిత అవగాహన సదస్సులో పాల్గోన్నారు మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబం లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని.. మీ అందరి దీవెనలతో పార్లమెంటు సభ్యుడిని అయ్యానన్నారు. పదవి లేక పోయిన అలానే ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయనో, మంచి భవిష్యత్తు వస్తుందనో అనుకున్నాం కానీ.. యువత తల్లిదండ్రులు కన్న కలల్లో సాదించుకుంది చాలా తక్కువన్నారు.

కన్న కలలు, ఆశలు ఆశగానే మిగిలిపోవటం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకుంటుందని.. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అనేక మంది యువత, మేదావుల బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. యోదానుయోదుల శ్రమ, కష్టం, కృషితో తెలంగాణ వచ్చిందన్నారు. సాదించుకున్న తెలంగాణలో ప్రజలు, యువతని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఎలా అడుకొంటుందో గమనించాలన్నారు.

మాటాలతోనే కాలయాపన చేస్తూందే తప్ప‌ కార్యరూపం ఎంత వరకు సాధించింది అనేది తెలంగాణ ప్రభుత్వం గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చాటలో తవుడు పోసి కుక్కలను ఉసి‌గొలిపినట్లు కాకుండా ప్రభుత్వం ఏర్పాడ్డ తరువాత ఖాళీ గా ఉన్న వేలాది పోస్టులకు ఎన్ని సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారో, ఎంత మందికి పోస్టులను నిరుధ్యోగులకు అవకాశం కల్పించారో…? చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ పక్షన యువతకు ఓరిగింది ఎమ్ లేదని చెప్పుకోవాటానికే సిగ్గుగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version