గ్రూపు-1 అభ్యర్థులకు అలర్ట్.. వెబ్ సైట్ లో ప్రిలిమ్స్ OMR షీట్స్..!

-

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు గ్రూపు 1 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. తొలిసారి నిర్వహించిన తరువాత పేపర్ లీకేజీ కారణంగా మళ్లీ ఎగ్జామ్ నిర్వహించారు. మళ్లీ నిర్వహించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ నిర్వహించలేదనే కారణంతో కొందరూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్లీ పోస్ట్ పోన్ చేశారు. అంతలోనే ప్రభుత్వం మారింది. ఈ తరుణంలో  గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ జూన్ 9వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రం కూడా రిలీజ్ చేశారు.  తాజాగా అభ్యర్థుల డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో OMR ఆన్సర్ షీట్లను కూడా పొందవచ్చని పేర్కొంది. ప్రిలిమినరీ కీ సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news