కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే.. MLC జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఛతీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం జస్టీస్ నరసింహారెడ్డి నేతృత్వంలో పవర్ కమిషన్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ అప్పటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సమన్లు జారీ చేసింది. ఈ అంశాలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని కోరింది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులకు కేసీఆర్ ఘాటు రిప్లై ఇచ్చారు. కమిషన్ విచారణ సరిగ్గా లేదని.. జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణ నుండి తప్పుకోవాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ రాసిన రిప్లై లేఖ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ తీరుపై మండిపడుతున్నాయి.

కేసీఆర్ లేఖపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పవర్ కమిషన్ విచారణకు కేసీఆర్ సహకరించకపోవడం అంటే ఆయన నేరాన్ని అంగీకరించినట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ కమిషన్ అధికారిని కేసీఆర్ నేరుగా భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news