పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలతో రాజ్యాంగానికి, లౌకికత్వానికి ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బహుజనుల వాదం, ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తామన్నారు. ప్రజలు కూడా ఈ పొత్తును ఆశీర్వదిస్తారని అన్నారు. మాయవతితో పొత్తుల గురించి వివరిస్తామన్నారు. త్వరలో సీట్ల వ్యవహరంపై చర్చించుకుంటామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో 17 ఎంపీ నియోజకవర్గాల్లో విజయ పతాకం ఎగురవేసి, పూర్వ వైభవం ని దక్కించుకునేందుకు వ్యూహ రచన చేస్తుంది. ఈ నేపథ్యం లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం నీదు నంది నగర్ లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య పొత్తు గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నాగర్ కర్నూల్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారని సమాచారం.