76,290 మందికి దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్లు కేటాయింపు

-

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఇవాళ మొదటి విడత సీట్లను విడుదల చేశారు. ఫేజ్-1లో భాగంగా మొత్తం 1,04,784 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 76,290 మందికి సీట్లు కేటాయించారు. ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766, కామర్స్ 28,655, లైఫ్ సైన్సెస్ 15301, ఫిజికల్ సైన్సెస్ 14964, డేటా సైన్స్ 2502, డీ ఫార్మసీ 90, ఇతర గ్రూపుల్లో 7012 మంది విద్యార్థులు సీట్లు సాధించారు.ఈ సంవత్సరం కూడా కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన స్కిల్ కోర్సులను పలు కాలేజీల్లో విస్తరించారని తెలిసింది.

ఈ ఏడాది జూలై 8 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయని సమాచారం. కాగా, రాష్ట్రంలో 1,066 డిగ్రీ కాలేజీల్లో మొత్తం కలిపి 4,49,449 సీట్లున్నాయి. వీటిల్లో 135 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 86 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. గత ఏడాది 3,89,049 సీట్లకు గాను 2.05లక్షల సీట్లు దోస్త్ ద్వారా నిండాయి.

Read more RELATED
Recommended to you

Latest news