కాళేశ్వరంపై అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రశంసలు

-

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ వేడుకపై మంచి గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు.. తాజాగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రశంసలు అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని.. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రశంసల వర్షం కురిపించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఓ అద్భుతమని…. సొసైటీ ఎన్విరాన్‌మెంటల్, వాటర్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్-ఎలెక్ట్… షిర్లీ క్లార్క్ కితాబు ఇచ్చారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను ఆ ప్రాజెక్టు పెంచిందని అన్నారు.

అందుబాటులో ఉన్న  వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం… ప్రపంచ ముందున్న సవాల్‌ అన్న సొసైటీ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్…. తెలంగాణ ఈ విషయంలో ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టులను ప్రపంచానికి పరిచయం చేయడంతమ ఉద్దేశమని సొసైటీ అధ్యక్షురాలు లెమన్ తెలిపారు. ప్రాజెక్టు అనుభవాలను వీడియోలు, ఇతర రూపాల్లో ప్రపంచానికి చాటుతామని లెమన్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news