అమృత్‌ మిషన్‌ కింద తెలంగాణకు రూ.832 కోట్లు

-

అమృత్‌ మిషన్‌ కింద తెలంగాణకు కేంద్రం రూ.832.60 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. రాజ్యసభలో సోమవారం బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథిరెడ్డి ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణలో ఇంతవరకు ఈ పథకం కింద రూ.1,663 కోట్ల విలువైన 66 ప్రాజెక్టుల పనులు మొదలుకాగా, రూ.1,543 కోట్ల విలువైన 60 పనులు పూర్తయినట్లు చెప్పారు. ఇందులో రూ.1,310 కోట్ల విలువైన 26 తాగునీటి సరఫరా ప్రాజెక్టులు, రూ.203 కోట్ల విలువైన 4 మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులు, రూ.30 కోట్ల విలువైన పార్కులు ఉన్నట్లు.. రూ.114 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టు, రూ.6 కోట్ల విలువైన పార్కుల అభివృద్ధి పురోగతిలో ఉన్నట్లు  కౌశల్‌ కిశోర్‌ తెలిపారు.

మరోవైపు.. పీఎం ఆవాస్‌ యోజన(అర్బన్‌) కింద తెలంగాణకు 2,50,084 ఇళ్లు మంజూరయ్యాయని.. ఇంతవరకు 2,23,361 నిర్మాణాలు పూర్తయినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌కే 1,52,511 మంజూరు చేయగా, 1,40,865 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. వివిధ ప్రాంతాల్లో 27,858 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news