విజయవాడ విషాదం చోటు చేసుకుంది.హోటల్ కిటికీ నుంచి పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెజవాడలో విషాదం జరిగింది. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందినట్లు తాజాగా బయటకు వచ్చింది. హోటల్ మినర్వా లో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
విశాఖ నుంచి శ్రీశైలం వెళ్తున్న నాగరాజు కుటుంబం… మినార్వా హోటల్ లో బస కు దిగింది. అయితే… రాత్రి సమయంలో దొంగ – పోలీస్ ఆట ఆడారట అన్నా చెల్లెల్లు. ఇక దాక్కొనే క్రమంలో కిటికి తలుపు తెరిచిందట చిన్నారి. ప్రమాదవశాత్తు హోటల్ కిటికీ నుంచి పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… విచారణ చేపట్టారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.